BJP Protest Against Pothireddypadu .. పోతిరెడ్డిపాడు దీక్షతో బీజేపీలో వర్గపోరు.
పోతిరెడ్డిపాడుకు శ్రీశైలం జలాల తరలింపు విషయమై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదంపై కరీంనగర్ ఎంపీ, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఒక రోజు పాటు చేపట్టిన నిరసన దీక్ష పార్టీలో అంతర్లీనంగా నెలకొన్న వర్గపోరును తెరపైకి తీసుకు వచ్చిన్నట్లు అయింది.
గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించిన జి కిషన్ రెడ్డి, డా కె లక్ష్మణ్ లవలె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అందరిని కలుకుపోయే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు పార్టీ వర్గాల నుండి చెలరేగుతున్నాయి.
లాక్ డౌన్ కారణంగా కొద్దీ రోజులుగా అన్ని కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా సంజయ్ జరుపుతున్నారు. ప్రతి కార్యక్రమంలో కొందరు పార్టీ ప్రముఖులు పాల్గొంటూనే ఉన్నారు.
అయితే ఈ నిరసన దీక్షలో ఆయన తప్ప మరెవ్వరు పాల్గొనలేదు. పాత మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన నాయకులను కూడా తమ ఇళ్లవద్ద నుండే నిరసన జరపమని కోరినా చెప్పుకోదగిన స్పందన కనిపించలేదు.
పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వం జిఓ తీసుకు వచ్చినప్పుడు సంజయ్ అసలు స్పందించలేదు. మొదటగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తర్వాత డా. కె లక్ష్మణ్ స్పందించారు.
కేసీఆర్, జగన్ లాలూచి పడినట్లు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఒక రోజు నిరసన దీక్ష చేపట్టాలని మాజీ మంత్రి డి కె అరుణ సంకల్పించారు.
BJP Protest Against Pothireddypadu .. పోతిరెడ్డిపాడు దీక్షతో బీజేపీలో వర్గపోరు.