gas rates are decreased
gas rates are decreased

దేశ వ్యాప్తంగా భారీగా తగ్గిన వంట గ్యాస్‌ ధర

రూ.192 వరకు తగ్గిస్తున్నట్లు ఐఓసీ ప్రకటన

14.2కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో రూ.162.50 తగ్గింపు. ముంబైలో రూ.135.50 తగ్గింపు. దేశంలో వంట గ్యాస్‌ సిలెండర్‌ ధర భారీగా తగ్గింది.

సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరుపై మెట్రో నగరాల్లో
రూ.192 వరకు తగ్గిస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) ఈ రోజు ప్రకటించింది.

మూడు నెలల్లో వరుసగా మూడోసారి గ్యాస్ ధరలు తగ్గాయి. నేటి నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం 14.2కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో రూ.162.50 తగ్గిస్తున్నట్లు ఐఓసీ పేర్కొంది. ముంబైలో రూ.135.50 తగ్గిస్తున్నట్లు వివరించింది. తగ్గించిన ధరల మేరకు ప్రస్తుతం 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో రూ.581.50గా ఉంది.
నిన్న వరకు రూ.744గా ఉండేది. కోల్‌కతాలో నిన్నటి వరకు 774.50గా ఉన్న సిలెండర్ ధర ఇప్పుడు రూ.584.50కి తగ్గింది.
ముంబైలో నిన్న వరకు 714.50 ఉన్న ధర ఇప్పుడు 579 రూపాయలు అయింది. చెన్నైలో నిన్నటి వరకు 761.50గా ఉన్న ధర ఇప్పుడు 569.50గా ఉంది. మూడు నెలల నుంచి ఇప్పటివరకు ఢిల్లీలో సిలండర్ ధర మొత్తం రూ.277 తగ్గింది.

హైదరాబాద్‌లో భారీగా తగ్గిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ,
ఇవాళ్టి నుంచి సిలిండర్‌పై రూ.207 తగ్గింపు ,
ఏప్రిల్‌ నెలలో రూ.796.50 ఉన్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.589.50లకు తగ్గింపు,
తగ్గిన ధర ఇవాళ్టి నుంచి అమలులోకి ,
15రోజులుపాటు అమలులో ఉండనున్న తగ్గిన వంట గ్యాస్‌ ధరలు :వంట గ్యాస్‌ తగ్గిన ధరలు

అనంతపురం-214
చిత్తూరు -186
కడప-208
తూర్పుగోదావరి-179
గుంటూరు-180
కృష్ణ-183.5
కర్నూలు-205.5
నెల్లూరు-176.5
ప్రకాశం-190.5
శ్రీకాకుళం-179
విజయవాడ-74
విశాఖపట్నం-192
విజయనగరం-172
పశ్చిమగోదావరి-190.5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here