High Tension at Vizag LG Polymers .. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద హైటెన్షన్ .. తరలించాలని పెద్ద ఎత్తున నినాదాలు
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణ ఎల్ జీ పాలిమర్స్ పరిశ్రమ విషయంలో ప్రకంపనలు రేగుతున్నాయి. ఆ కంపెనీ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు.
ఎల్ జీ పాలిమర్స్ ను అక్కడి నుంచి తరలించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంకటాపురం గ్రామస్థులంతా దర్నాకు దిగారు.
తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.
అలాగే.. స్థానికుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా పరిశ్రమకు సమీపంలో ఉన్న వెంకటాపురం గ్రామస్థులు భారీస్థాయిలో అక్కడికి తరలి వచ్చారు.
తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యువకుల్ని అరెస్టు చేసే క్రమంలో వారు ప్రతిఘటించడంతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
పోలీసులు అక్కడికి భారీగా చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. వెంకటాపురం గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టి.. ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతటితో ఆగకుండా ప్రజలు కావాలో యాజమాన్యాలు కావాలో తేల్చుకోవాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ అక్కడ హైటెన్షన్ నెలకొని ఉంది.
High Tension at Vizag LG Polymers .. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద హైటెన్షన్ .. తరలించాలని పెద్ద ఎత్తున నినాదాలు