Karnataka Govt Announces Free Bus Travel for Laborers
Karnataka Govt Announces Free Bus Travel for Laborers

Karnataka Govt Announces Free Bus Travel for Laborers మూడు రోజులు బస్సుల్లో ఉచిత ప్రయాణం. లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా అందరి జీవితాలు తారుమారయ్యాయి. ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి.

ప్రజల కష్టాలను చూస్తున్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ సంక్షోభంలో ప్రజలకు తమ ప్రభుత్వాలు ఏమైనా చేయాలని భావిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరోనా యోధులకు రూ.10 లక్షల ఆరోగ్యబీమాను ప్రకటించారు.

తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప వలస కార్మికులు తమ తమ ఊళ్లకు చేరుకునేందుకు కేసీఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. బెంగుళూరు, వివిధ జిల్లాల నుంచి వలస కార్మికులు బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అన్నారు.

ఈ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టంచేశారు. అయితే బస్సు స్టాప్‌లలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడకుండా చూసుకోవాలని కోరారు.

Karnataka Govt Announces Free Bus Travel for Laborers మూడు రోజులు బస్సుల్లో ఉచిత ప్రయాణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here