Corona Zones info
Corona Zones info

May 3ed Redzone Information .. లాక్​డౌన్​ గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. తాజాగా గుర్తించిన జోన్ల వివరాలను వెల్లడించింది కేంద్రం.

దేశ రాజధాని దిల్లీ సహా ఆరు ప్రధాన నగరాలన్నీ రెడ్​జోన్​లోనే ఉన్నట్లు తెలిపింది.

దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌లు రెడ్‌జోన్‌లోనే ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.

Corona Zones info
Corona Zones info

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న రెండోదశ లాక్​డౌన్ మే 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. ​తదుపరి ఎలా ముందుకెళ్లాలన్న అంశాలపై చర్చించి జోన్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

తాజాగా రెడ్​, ఆరెంజ్​, గ్రీన్​ జోన్ల జాబితాను సవరించింది. దేశ రాజధాని దిల్లీ సహా మెట్రోపాలిటన్​ నగరాలైన ముంబయి, కోల్​కతా, హైదరాబాద్​, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్​ రెడ్​జోన్​లోనే ఉన్నాయని ప్రకటించారు అధికారులు.

లాక్​డౌన్​ తర్వాత వారం రోజుల వరకు ఇది అమల్లో ఉండనుందని తెలిపారు. దీని ప్రకారం.. ఈ రెడ్​జోన్లలో లాక్​డౌన్ కొనసాగించేందుకే ప్రధాని మొగ్గుచూపనున్నట్లు తెలుస్తోంది.

130 జిల్లాలు రెడ్​లోనే…ఆయా ప్రాంతాల్లో కొవిడ్​ వ్యాప్తి, రెట్టింపు రేటు, టెస్టింగ్​ సదుపాయాలు, అధికారుల చర్యలు ఆధారంగా జోన్లను విభజించింది కేంద్రం.

Corona Zones Info
Corona Zones Info

దేశవ్యాప్తంగా 733 జిల్లాల్లో… 130 జిల్లాలు రెడ్​జోన్​లో, 284 ఆరెంజ్​ జోన్​లో ఉండగా.. గ్రీన్​జోన్​లో 319 జిల్లాలున్నాయి.

అత్యధికంగా ఉత్తర్​ప్రదేశ్​లో 19 జిల్లాలు రెడ్​జోన్​లో ఉన్నాయి. మహారాష్ట్రలో 14, తమిళనాడులో 12, దిల్లీలో 11, గుజరాత్​లో 9 జిల్లాల్ని ఈ జాబితాలో చేర్చింది కేంద్రం.

కరోనా తీవ్రతను బట్టి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఈ మేరకు లేఖ రాశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రీతీ సదన్‌.

దిల్లీ చుట్టుపక్కల ఉన్న పలు ప్రధాన పట్టణాలు.. ఫరీదాబాద్‌, నోయిడా, మేరఠ్​లు కూడా రెడ్‌జోన్‌లో ఉన్నట్లు ఆమె తెలిపారు. గురుగ్రామ్​, ఘజియాబాద్​ ఆరెంజ్‌జోన్‌లో ఉన్నాయి.

21 రోజులు కేసుల్లేకుంటే..ఏ జిల్లాలోనైనా కరోనా కేసులు లేకున్నా.. గత 21 రోజులుగా కొత్త కేసులు నమోదుకాకున్నా ఆ ప్రాంతాన్ని గ్రీన్​జోన్​గా ప్రకటిస్తారు. రెడ్​ జోన్​లో వరుసగా 28, ఆరెంజ్​ జోన్​లో 14 రోజులపాటు కరోనా కేసులు నమోదుకాకుంటే.. ఆ ప్రాంతాలు గ్రీన్​జోన్​లుగా మారుతాయి.

May 3ed Redzone Information

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here