Modi Video Conference with State C.M's at Tomorrow 3 PM
Modi Video Conference with State C.M's at Tomorrow 3 PM

Modi Video Conference with State CM’s at Tomorrow 3 PM .. రేపు 3 pm కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ .. మోదీ

కరోనా వేళ.. దేశ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు.

సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశం జరగనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.

Modi Video Conference with State C.M's at Tomorrow 3 PM
Modi Video Conference with State C.M’s at Tomorrow 3 PM

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ అమలవుతున్న విధానాన్ని సమీక్షించనున్నారు ప్రధాని.

మే 17తో లాక్​డౌన్​ గడువు తీరనున్న నేపథ్యంలో.. తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలు, అవలంబించాల్సిన విధానాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలు స్వీకరించనున్నారు.

లాక్​డౌన్​ ఎత్తివేత, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం వంటి వ్యూహాలపైనా సీఎంలతో చర్చించనున్నట్లు సమాచారం. ఈ సారి భేటీకి కేంద్ర హోం, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులు కూడా హాజరవనున్నట్లు తెలుస్తోంది.

గత సమావేశంలో కొంతమంది సీఎంలకే మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రధాని.. ఈసారి అందరినీ మాట్లాడాలని కోరినట్లు సమాచారం.ఐదోసారి…దేశంలో లాక్​డౌన్​ పరిస్థితులపై ముఖ్యమంత్రులతో మోదీ భేటీ కావడం ఇది ఐదోసారి. జనతా కర్ఫ్యూ విధించే ముందు మార్చి 22న తొలిసారి సీఎంలతో మాట్లాడారు.

Modi Video Conference with State C.M's at Tomorrow 3 PM
Modi Video Conference with State C.M’s at Tomorrow 3 PM

తర్వాత వేర్వేరు సందర్భాల్లో లాక్​డౌన్​ పొడిగింపునకు… ముఖ్యమంత్రుల అభిప్రాయాలు కోరేందుకు పలుమార్లు మోదీ వీడియోకాన్ఫరెన్స్​లు నిర్వహించారు.

ఏప్రిల్​ 27న చివరిసారిగా సమావేశమయ్యారు. కరోనా దృష్ట్యా.. దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్​డౌన్​ అమల్లో ఉంది. అనంతరం.. వైరస్​ తీవ్రతను బట్టి ఇప్పటికి రెండు సార్లు లాక్​డౌన్​ను పొడిగించింది కేంద్రం.

Modi Video Conference with State CM’s at Tomorrow 3 PM .. రేపు 3 pm కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ .. మోదీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here