Nellore Fire accident at chemical factory .. నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీ దగ్డం తో భయం, భయం.కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం…
నెల్లూరు: బోడిగాడితోట వద్ద ఉన్న బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి.
బ్లీచింగ్, యాసిడ్ తదితర రసాయన పదార్ధాలు ఉండడంతో మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది.
ఫ్యాక్టరీలో వున్న సామాగ్రి అంతా అగ్నికి ఆహుతైంది. ఫైర్ ఇంజన్‌తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు.
రోడ్డుపక్కనే పేదలు ఎక్కువగా వుండడంతో భయాందోళనకు గురయ్యారు. అగ్నికీలలు ఎగసిపడడంతో వారంతా పరుగులు తీశారు. ఈ ఘటనపై హైదరాబాద్‌లో ఉన్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆరా తీశారు.
Nellore Fire accident at Chemical Factory .. నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం