Sirpur Kagaj Nagar Paper Mill Gas Leak .. సిర్పూర్ పేపర్ మిల్లులో గ్యాస్ లీక్. కరోనా కాలం పోతుంది అనుకుంటే.. ఇది గ్యాస్ లీకుల కాలం వచ్చింది.. ఏదిఏమైనా పోయే కాలం వచ్చింది అనుకుంట..
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి స్టైరిన్ వాయివు లీక్ కావడంతో 12 మంది చనిపోవడం, వేలమంది అస్వస్థతకు గురికావడం తెలిసిందే.
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లులో గ్యాస్ లీకైంది. పైప్ లైన్ నుంచి గ్యాస్ బయటికి రావడతో అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో ఒకరు అస్వస్థతకు గురయ్యారు.
అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. యాజమాన్యం సాంకేతిక నిపుణులతో వెంటనే లీకేజీని అరికట్టినట్లు తెలుస్తోంది. దీనిపై వివరాలు పూర్తిగా వెల్లడించలేదు. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
లాక్ డౌన్ నుంచి చాలా పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వడంతో వాటిని తెరుస్తున్న విషయం విదితమే. అన్ని తనిఖీలు చేయించి, నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే పనులు తిరిగి ప్రారంభించాలని ఫ్యాక్టరీలను కేంద్రం ఆదేశించింది.
విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఇంకా కొనసాగుతుండగానే దేశంలో పలుచోట్ల గ్యాస్ లీక్ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
Sirpur Kagaj Nagar Paper Mill Gas Leak .. సిర్పూర్ పేపర్ మిల్లులో గ్యాస్ లీక్.