ఢిల్లోని తెలుగు టీవీ జర్నలిస్టుకు కరోనా .. కరోనా వైరస్‌పై పోరాటంలో వైద్యులతో పాటు జర్నలిస్టుల కూడా ధైర్యంగా ముందుకు దూసుకెళ్తున్నారు. వార్తల కవరేజీ కోసం, ప్రజలకు సమాచారాన్ని అందించడానికి రిస్క్ తీసుకుని మరీ విధులు నిర్వహిస్తున్నారు.
దీంతో ఇప్పటికే వందమందికిపైగా జర్నలిస్టులకు వైరస్ సోకింది. తాజాగా ఓ ప్రముఖ తెలుగు టీవీ చానల్ కు చెందిన ఢిల్లీ ప్రతినిధికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఆయనకు ఇదివరకే మధుమేహం కూడా ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తెలిసింది.
దీంతో ఆయనకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబసభ్యులను క్వారంటైన్ చేశారు. ఆయనను కలసిన ఇతర జర్నలిస్టులు కూడా పరీక్షలు చేయించుకుంటున్నారు.
ఆయన ఇటీవల కేంద్రం హోం శాఖ సహాయమంత్రిని ఇంటర్వ్యూ చేశారు.