Transport Services will Resume, Lockdown Call-Off .. లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి ఏంటి .. ప్రజారవాణాకు అనుమతి ప్రశ్నార్థకం ?
భారత్లో కట్టుదిట్టమైన లాక్ డౌన్ తో ఇప్పటివరకు కరోనాను కేంద్ర ప్రభుత్వం కట్టడి చేసింది. అయితే, ఇప్పుడు ఇండియాలో లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి ఏంటి అని ప్రశ్నార్థకంగా మారింది.

లాక్డౌన్కు దశలవారీగా సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో దుకాణాలు తెరుచుకునేందుకు ఆంక్షలతో కూడిన సడలింపులు ఇచ్చారు.
అయితే ఇదే విషయమై ప్రధానమంత్రి మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్పరేన్స్ నిర్వహించి అందరి నిర్ణయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, వచ్చే వారంలోపు దాదాపు అన్ని గ్రీన్ జోన్లలో ప్రజారవాణా మొదలు కానుంది. అయితే కరోనా వైరస్ కారణంగా మున్ముందు ప్రజా రవాణా వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సిటీ బస్సులు, మెట్రో సర్వీసులలో భౌతిక దూరం పాటించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోనున్నాయి.
ఇక రద్దీ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మెట్రో రూ. 100 కోట్లు, ఆర్టీసీ రూ. 120 కోట్ల మేరకు నష్టాలు చవిచూశాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న నిర్ణయాల్లో ప్రధానంగా మెట్రోలపైనే ఎక్కువగా ఆంక్షలు ఉండబోతున్నాయని సమాచారం.
మెట్రో రైళ్లలో ప్రయాణీకులు నిలుచునేందుకు వైట్ మార్కింగ్ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో ఒక్కో రైలులో 1000 మంది వరకు ప్రయాణించేవారు.
ఇప్పుడు అలా కాకుండా కేవలం 50 శాతం మంది మాత్రమే జర్నీ చేసేలా చర్యలు చేపట్టనున్నారు. అంతేకాకుండా స్టేషన్కు వచ్చే ప్రతీ ప్రయాణీకుడికి శానిటైజర్లను అందజేయడం, భౌతిక దూరాన్ని పాటించడం, మాస్క్ ఉంటేనే అనుమతించడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు. మరోవైపు ఆర్టీసీ కూడా ఇదేవిధంగా ప్రణాళికలను సిద్దం చేస్తోంది.
ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, జాగ్రత్తలు ప్రజలను రక్షించడానికే అని గుర్తించి ప్రజలు కూడా వీలైనంత వరకు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి తమ తమ పనులకు వెళ్లాలని సూచన.
Transport Services will Resume, Lockdown Call-Off .. లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి ఏంటి .. ప్రజారవాణాకు అనుమతి ప్రశ్నార్థకం ?