#VizagLGpolymersLeakage
#VizagLGpolymersLeakage

#VizagLGpolymersLeakage .. ప్రమాదానికి అదే కారణమా.. అలారం మోగలేదు ఎందుకు ?

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ప్రకటించారు

ysjagan met with the casualties of #VizagGasLeak
ysjagan met with the casualties of #VizagGasLeak

విశాఖలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన తర్వాత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు.

రాత్రిపూట ఘటన జరిగినప్పటికీ అధికారులు, సిబ్బంది తక్షణం స్పందించారని… అందుకు వారిని అభినందిస్తున్నానని సీఎం చెప్పారు.

మృతులు ఒక్కొక్కరి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రభుత్వం తరపున ఇస్తున్నట్టు ప్రకటించారు. గ్యాస్ ప్రభావానికి ప్రజలు మానసిక ఒత్తిడికి గురయ్యారని… ఆ గ్రామాల్లోని వారందరికీ కుటుంబానికి పది వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పారు.

ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారందరికీ 25వేలు ఇస్తామన్నారు. వెంటిలేటర్‌పై చికిత్స తీసుకునే పరిస్థితి వచ్చిన వారికి 10 లక్షలు పరిహారం అందిస్తామన్నారు. రెండుమూడు రోజులు ఆస్పత్రిలో ఉండే పరిస్థితి ఉన్న వారికి లక్ష రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.

ysjagan met with the casualties of #VizagGasLeak
ysjagan met with the casualties of #VizagGasLeak

గ్యాస్ లీక్‌ ప్రభావిత ప్రాంతాల వారికి పరిస్థితి చక్కబడే వరకు ప్రభుత్వమే భోజన సదుపాయం కూడా కల్పిస్తుందని చెప్పారు. చనిపోయిన పశువులకు పూర్తిగా నష్టపరిహారం అందిస్తామన్నారు.

ఘటనపై విచారణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది నిర్ణయిస్తామన్నారు. రెండు మూడు రోజుల పాటు సీఎస్ నీలం సాహ్నీ, మంత్రులు కన్నబాబు, బొత్స, అవంతి ఇక్కడే ఉండి బాధితులకు అండగా ఉంటారని ముఖ్యమంత్రి చెప్పారు.

ysjagan met with the casualties of #VizagGasLeak
ysjagan met with the casualties of #VizagGasLeak

ఘటన జరిగిన వెంటనే కంపెనీ వద్ద అలారం ఎందుకు మోగించలేదు అన్నది అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత కంపెనీని తరలించే అంశంపైనా ఆలోచన చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

#VizagLGpolymersLeakage .. ప్రమాదానికి అదే కారణమా.. అలారం మోగలేదు ఎందుకు ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here