Why Vijay Sai Reddy Call Off and Nani Call In? .. విజయసాయిరెడ్డిని కారు నుంచి దించేసిన జగన్
విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అస్వస్థతకు గురయ్యారు.
దాదాపు 30 మంది ఈ ఘటనలో మరణించారు. మరికొందరు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వారిని పరామర్శించడానికి సీఎం జగన్ విశాఖకు చేరుకున్నారు.
సీఎం జగన్ తాడేపల్లిలోని అధికారిక నివాసం నుంచి విశాఖకు బయల్దేరేటప్పుడు ఓ ఆసక్తికర ఓ సంఘటన జరిగింది. విమానాశ్రయానికి వెళ్ళడానికి జగన్ మొదట కారు ఎక్కి ముందు సీటులో కూర్చున్నారు.
వెంటనే వెనక సీటులో వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూర్చున్నారు. అయితే క్షణాల వ్యవధిలోనే విజయసాయి కారు నుంచి దిగిపోయారు. ఆ తరువాత మంత్రి ఆళ్లనాని కారులోకి ఎక్కారు. కారు విమానాశ్రయానికి తరలిపోయింది.
ఎంపీ విజయ్ సాయి అక్కడే ఉండిపోయారు. దీంతో విజయసాయి కారు నుంచి ఎందుకు దిగిపోయారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
అయితే, ఈ వ్యవహారం ప్రజల ఆరోగ్యానికి సంబంధించినది కావడంతో… తనతో పాటు ఆరోగ్యమంత్రిని జగన్ తీసుకెళ్లారని తెలుస్తోంది.
Why Vijay Sai Reddy Call Off and Nani Call In? .. విజయసాయిరెడ్డిని కారు నుంచి దించేసిన జగన్