Wuhan Coronavirus Back Again .. వుహాన్లో మళ్లీ తిరగబెట్టింది.. ఒకే అపార్ట్మెంట్లో ఐదుగురికి
మొండిఘటంలానే వ్యవహరిస్తోంది కరోనా వైరస్. చైనాలో తగ్గుముఖం పట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఆ మహమ్మారి మళ్లీ చైనాలో కోరలు చాస్తున్నట్టుగానే ఉంది.
కరోనాకు పుట్టిల్లు అయిన వుహాన్లో కరోనా మళ్లీ కలకలం రేపింది. ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఐదుగురు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్ అని తేలింది.
వారిలో ఓ వృద్ధురాలు కూడా ఉంది. ఆమె భర్తకు ఇటీవలే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మళ్లీ అక్కడ భయాందోళనలు మొదలుకున్నాయి.
ఇటీవలే వుహాన్లో లాక్డౌన్ ఎత్తివేశారు. అందరూ ఇప్పుడిప్పుడే తమ తమ పనుల్లో నిమగ్నం అయివున్నారు. కార్యాలయాలు, మ్యూజియంలు, కొన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, ఇతర వినోద ప్రధాన కేంద్రాలు కూడా తెరుచుకున్నాయి.
ఇక కరోనా తోకముడిచిందిలే అనుకుని చైనీయులు వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో మళ్లీ పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
వైరస్ వ్యాప్తి చెందకుండా తగు ముందు జాగ్రత్త చర్యలకు పూనుకుంటున్నారు. కాగా, కరోనా నిర్ధారణ అయిన ఐదుగురిలోనూ ఎలాంటి లక్షణాలు లేకపోవడం కూడా అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. వారిని హోం ఐసోలేషన్లో ఉంచారు.
Wuhan Coronavirus Back Again .. వుహాన్లో మళ్లీ తిరగబెట్టింది.. ఒకే అపార్ట్మెంట్లో ఐదుగురికి